Tekmal : కన్నుల పండువగా గ్రామదేవతలకు బండ్ల ఊరేగింపు


Tekmal : మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామంలోని దుర్గమ్మ, పోచమ్మ గ్రామ దేవతల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రెండవ రోజైన సోమవారం అమ్మవార్లకు ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Tekmal : కన్నుల పండువగా గ్రామదేవతలకు బండ్ల ఊరేగింపు

రంగు రంగుల వస్త్రాలతో, వేప కొమ్మలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించిన జాతర బండ్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు చప్పుళ్లతో డ్యాన్స్ చేసుకుంటూ ఉత్సాహాంగా ఆలయం చుట్టూ బండ్లను ప్రదక్షిణలు చేయించారు.

Tekmal : కన్నుల పండువగా గ్రామదేవతలకు బండ్ల ఊరేగింపు

tekmal రేపు బండి శిడి

జాతర సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. నేటి రాత్రి నుంచి మూడు రోజుల పాటు వాన దేవుడు అనే వీధి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. మంగళ వారం ఉదయం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం గొల్లగూడెం నుంచి బండి శిడి ని ఊరేగింపుగా తీసుకువస్తారు. అధిక సంఖ్యలో ప్రజలు జాతర ఉత్సవాలను చూడటానికి తరలి వస్తున్నారు.

Tekmal : కన్నుల పండువగా గ్రామదేవతలకు బండ్ల ఊరేగింపు