ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ECI released Election schedule: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ (ఫిబ్రవరి 18, 2026)న విడుదల చేసింది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26న నోటిఫికేషన్ ఇస్తారు. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 గడువు తేదీ. 6న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువు. మార్చి 16న పోలింగ్, అదే రోజు సా.5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్:

ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల

నామినేషన్ల దాఖలు చేసే చివరి తేదీ మార్చి 5

మార్చి 6న నామినేషన్ల పరిశీలన

నామినేషన్ల ఉపసంహరణ మార్చి 9 చివరి తేదీ

మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫోలింగ్.

అదే రోజున అంటే మార్చి 16, 2026 సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.

ఈ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల (MLAs) ఓట్ల ద్వారా జరుగుతాయి. పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.

మహారాష్ట్ర 7 స్థానాలు, తమిళనాడు 6 స్థానాలు, పశ్చిమ బెంగాల్ 6 స్థానాలు (ఒకటి జనవరి 5, 2026 నుంచి ఖాళీ), బిహార్ 4 స్థానాలు, తెలంగాణ 2 స్థానాలు, అస్సాం 3 స్థానాలు, ఒడిశా 4 స్థానాలు, ఛత్తీస్‌గఢ్ 2 స్థానాలు, హర్యానా 2, హిమాచల్ ప్రదేశ్ 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.