Attack on KCR Camp Office Gajwel : గజ్వేల్ క్యాంప్ కార్యాలయం పై దాడి అప్రజాస్వామికం..!

హుస్నాబాద్ ఏప్రిల్ 4 : ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసిన ప్రభుత్వం ( Attack on KCR Camp Office Gajwel ) అప్రజాస్వామికంగా దాడులు చేయడం సరికాదని బిఆర్ఎస్ నాయకులు గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ)రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ,ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పూర్తిగా “గూండాల రాజ్యం”గా మార్చేశారని ఎద్దేవ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయం పైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ రథసారథి పై ఇలా వ్యవహరించడం దుర్మార్గం. దాడులకు పాల్పడుతున్న గుండాలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ మీ కుట్రలకు దాడులకు బీఆర్ఎస్ ఏమాత్రం భయపడదు. గ్రామ సభల్లో ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితిలో ఉన్నారని,ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొంటామని,రానున్న రోజులలో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.