ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన ఛలో సెక్రటేరియట్’ పిలుపుతో ఫారూక్ నగర్ డిపో కార్మికులు వెళ్లారు. వేతన సవరణ (PRC) చేసి పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని యూసూఫ్ అలీ డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన డీఏ (DA) అరియర్స్ మరియు ఇతర అలవెన్సులను విడుదల చేయాలన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలోని అస్పష్టతను తొలగించి, కార్మికులందరికీ పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలు కల్పించాలన్నారు. డిపోల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పని వేళలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఆలె రాజు, మహేష్ సింగ్, ఎల్లోజి, జివి.రవి, రాములు తదితరులు ఉన్నారు.