మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ సంగీత
క్వింటాల్ ఏ గ్రేడ్ రకానికి ₹2,389గా నిర్ణయం
FPO Paddy Procurement Center : రైతులు తాము పండించిన పంటను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఎండబెట్టి, శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని చల్లపల్లి సర్పంచ్ ఎల్లంపల్లి సంగీత సూచించారు. శనివారం చల్లపల్లి గ్రామంలో FPO (రైతు ఉత్పత్తిదారుల సంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం క్వింటాల్ వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధరగా ఏ గ్రేడ్ రకానికి ₹2,389, బి గ్రేడ్ రకానికి ₹2,369 కేటాయించిందని తెలిపారు. రైతులు ప్యాడీ క్లీనర్లతో ధాన్యాన్ని శుభ్రం చేసుకుని కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లంపల్లి గోపాల్, ఉప సర్పంచ్ పిట్ల యాదయ్య, డైరెక్టర్లు ఎల్లంపల్లి లింగమయ్య, ఎర్రోళ్ల నర్సింలు, అకౌంటెంట్ కుర్మా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అలాగే సెంటర్ ఇంచార్జి ఎల్లంపల్లి మోహన్, ఎల్లంపల్లి శ్రీనివాస్, వార్డు మెంబర్లు దండు సత్యం, పెడల కృష్ణ, మందుముల చంద్రమోహన్ రెడ్డి, మస్కురి గోపాల్, కుర్మా మల్లయ్య, దండు బలరాం తదితరులు పాల్గొన్నారు.