భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం బొమ్మలరామారం మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో సిపిఐ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సామ్రాజ్యవాద ధోరణిని నిరసిస్తూ, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని వారు డిమాండ్ చేశారు.
సిపిఐ CPI మండల కార్యదర్శి అన్నేమైన వెంకటేశం
ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి అన్నేమైన వెంకటేశం మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ అమెరికా సామ్రాజ్యవాదానికి పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతోందని ధ్వజమెత్తారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి బుడుమ సంధ్యారాణి, మహిళా సంఘం నాయకురాలు వడ్లకొండ భారతమ్మతో పాటు చిప్పల జయమ్మ, ధీరవతు గంగారం, విమల, కొండల్ రెడ్డి, అన్నేమైనా కమల, లక్ష్మి, అండాలు, నిర్మల, బుజ్జి, విఠల్ నాయక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.