Tekmal: మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని దుర్గమ్మ, పోచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సం హోళీ పండుగ తర్వాత ఐదవ రోజు నుంచి ఐదు రోజుల పాటు జాతరను జరిపించడం ఆనవాయితీగా వస్తుంది.
ఘనంగా బోనాల సమర్పణ

అందులో భాగంగా నేడు (ఆదివారం) అమ్మవార్లకు బోనాలు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలను తీశాను. భక్తిశ్రద్దలతో మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకుని ఊరేగింపుగా దుర్గమ్మ, పోచమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు చప్పుళ్లు, పోతురాజు విన్యాసాలతో ఉత్సాహాంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి బోనాలను అమ్మవార్లకు సమర్పించారు.
రేపు బండ్ల ఊరేగింపు ఉత్సవాలు

జాతర సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలతో ఆలయాన్ని అందంగా ముస్తాము చేశారు. రేపు (సోమవారం) బండ్ల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల ఊరేగింపు చేయడానికి సన్నద్దమవుతున్నారు.
