Talari Mahender First Death Anniversary : నవ్వుతూ పలకరించే మనిషి లేకపోయినా.. జ్ఞాపకాలు సజీవం

తలారి మహేందర్ ప్రథమ వర్ధంతి

Talari Mahender First Death Anniversary: అందరితో కలిసి మెలిసి ఉంటూ, చిరునవ్వుతో పలకరించే హోంగార్డు తలారి మహేందర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు మాత్రం అందరి వెన్నంటే ఉన్నాయని కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. గత ఏడాది (2025) మార్చి 11న గుండెపోటుతో అకాల మరణం చెందిన మహేందర్ ప్రథమ వర్ధంతిని బుధవారం ఆయన స్వగ్రామం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లిలో ఘనంగా నిర్వహించారు.

Talari Mahender First Death Anniversary పేదలకు రగ్గుల పంపిణీ

మహేందర్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సమాజ సేవకు శ్రీకారం చుట్టారు. వర్ధంతి సందర్భంగా గ్రామంలోని పేదలకు, వృద్ధులకు దుప్పట్లు మరియు రగ్గులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలవడమే మహేందర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నగరంలోని ఓ అనాథాశ్రమంలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించారు.

గుర్తుకొస్తున్న జ్ఞాపకాలు

పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ విధి నిర్వహణలో నిబద్ధత చాటుకున్న మహేందర్, గతేడాది ఇదే రోజున అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. ఆయన మరణం చెంది ఏడాది కావస్తున్నా, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్థులు కళ్ళకు కటినట్లు వివరించారు. అందరితో ఆప్యాయంగా ఉండే మహేందర్ అకాల మరణం తమను నేటికీ కలిచివేస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ భార్య భాగ్యలక్ష్మి, కొడుకులు కౌశిక్, స్రుజన్, తమ్ముళ్లు సిద్దేశ్వర్, రాము, నాయికోటి భాస్కర్, కృష్ణ, రాజు, సురేష్ చేతుల మీదుగా రగ్గుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది.