నూతన వధూవరులను ఆశీర్వదించిన BRS నాయకులు
మెదక్ (Medak) జిల్లా టేక్మాల్ (Tekmal) గ్రామానికి చెందిన గుల్లకుంటి జోగయ్య కుమారుడు శ్రీకాంత్ వివాహం గురువారం ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ వివాహా వేడుకలకు హాజరైన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, బిఆర్ఎస్ పార్టీ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్ లు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట చింత రవి, మాజీ డైరెక్టర్ సాధు కిషన్, సాధు లింగం, బోగం వెంకటేశం, దుర్గయ్య, బోగం జయవర్ధన్, నాగరాజు, పట్నం సత్యం, నాయికోటి రాజు, బాలరాజు, తదితరులు ఉన్నారు.