JSR : మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి

మృతుని కుటుంబ సభ్యులను బీజేపీ (BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (JSR)కలిసి పరామర్శించి, ప్రగాడ సానుభూతి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామంలో అబ్బరబోయిన రాజయ్య తండ్రి అబ్బరబోయిన కనకయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న JSR వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కనకయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్, BJYM మండల అధ్యక్షులు సింగం రాజేందర్, శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిరంజీవి, సురేష్, శ్రీనాథ్, అంజి, రాకేశ్, అఖిల్ కుమార్, మధు, తదితరులు ఉన్నారు.