అసోంలో వాయుసేన యుద్ధ విమానం సుఖోయ్ 30 గల్లంతు

గౌహతి: భారత వాయుసేన (IAF)కు చెందిన అత్యంత శక్తివంతమైన సుఖోయ్ 30 MKI (Su-30 MKI) యుద్ధ విమానం అసోం రాష్ట్రంలో గల్లంతయింది. గురువారం సాయంత్రం సాధారణ శిక్షణలో భాగంగా గాలిలోకి ఎగిరిన ఈ విమానం, కొద్దిసేపటికే అదృశ్యం కావడంతో రక్షణ శాఖలో కలకలం రేగింది.

సుఖోయ్ 30 అసలేం జరిగింది?

వాయుసేన వర్గాల సమాచారం ప్రకారం.. ఈ యుద్ధ విమానం కార్బీ ఆంగ్లాండ్ జిల్లాలోని చోకిహోలా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. సాయంత్రం వేళలో ఈ ఘటన జరగడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

ముమ్మరంగా గాలింపు చర్యలు:

  • విమానం కూలిపోయిందా లేదా సాంకేతిక లోపంతో దారి తప్పిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

  • గల్లంతైన ప్రాంతం దట్టమైన అడవులు, కొండలతో కూడి ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

  • సెర్చ్ ఆపరేషన్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

పైలట్ల క్షేమ సమాచారం గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.