🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

నారాయణఖేడ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 నారాయణఖేడ్ | 🗓 11 Oct 2026 | ⏰ 06:09 PM

నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలోని అనేక గ్రామాలు, తండాల్లో ఉపాధి అవకాశాలు లేక రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉద్యోగాలు లభించక కుటుంబాలను వదిలి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రామాలు, తండాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు వెంటనే అమలు చేయాలని, ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే జీవనోపాధి పొందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మణ్, సోహెల్, రహీం తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్