🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన మెదక్ బీఆర్‌ఎస్ నాయకులు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 21 Oct 2026 | ⏰ 05:36 PM

మెదక్ ప్రతినిధి : దసరా పండుగను పురస్కరించుకొని మాజీ డిప్యూటీ స్పీకర్, బి.ఆర్.ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారిని మెదక్ బి.ఆర్.ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కొంపల్లిలోని పద్మా దేవేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ ఆరేళ్ళ. మల్లికార్జున్ గౌడ్ వారిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ కలయికలో నాయకులు పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యత, స్నేహభావం, పరస్పర సహకారం మరింత బలపడాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ళ మల్లికార్జున్ గౌడ్ పాటు యువ న్యాయవాది జీవన్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, మైనంపల్లి రంగన్న, కసాపురం కిరణ్, శ్రీకాంత్ సాగర్, చేదల అరుణ్, ఆంజనేయులు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్