🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బోథ్ లో పండుగ సాయన్న జయంతి పోస్టర్ ఆవిష్కరణ

Abhinay
Abhinay 📍 బోథ్ | 🗓 19 Oct 2026 | ⏰ 06:46 PM

బోథ్ ప్రతినిధి : ప్రజా వీరుడు తెలంగాణ రాబిన్ హుడ్ పాలమూరులో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దారుణంగా హత్య కావించబడ్డ ముదిరాజు ముద్దుబిడ్డ పండుగల సాయన్న 174వ జయంతి ని విజయవంతం చేయాలని బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ముదిరాజ్ సంఘాల నేతలు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , పండుగ సాయన్న ఉత్సవ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు సలేంద్ర శివయ్య ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జ నారాయణ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులుమందుల రమేష్,బోథ్ మండల అధ్యక్షులు జూoగాల భోజన్న ముదిరాజ్,బొజ్జ సాయన్న గొండ్ల భోజరాజు ముదిరాజ్ సున్నపు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.

ముదిరాజ్ హక్కుల కోసమే కాకుండా బహుజన హక్కుల కోసం తమ ప్రాణ త్యాగం చేసిన పండుగల సాయన్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈనెల 22న రవీంద్ర భారతి వేదికగా అధికారికంగా నిర్వహిస్తుందని ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా 22వ తేదీన అదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించే పండుగ సాయన్న జయంతి అధికారిక కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గానికి చెందిన ముదిరాజులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ముదిరాజులను బీసీ డీ నుండి బీసీఏలోకి మారుస్తూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవో నంబర్ 15 యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ముదిరాజులు ఉన్న గ్రామాల్లో పెద్దమ్మ తల్లి ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . పొచ్చర గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణంలో ఉన్న సమస్యలను తొలగించాలని బోథ్ ఎమ్మార్వో సుభాష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మన ముదిరాజ్ మహాసభ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కంచం లక్ష్మణ్ ముదిరాజ్ ఉద్యోగుల విభాగం కన్వీనర్ వన్యబోయిన చిన్నయ్య ముదిరాజ్, జె ట్టి రాజేశ్వర్ ముదిరాజ్, సున్నం శ్రీనివాస్, కూన స్వామి, గోన్ల పోతన్న, నాయుడి శ్రీనివాస్, యాతకరి నారాయణ, అయినవేని నర్సయ్య, కడారి రవి ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
Abhinay
రచయిత గురించి (Author Bio)

Abhinay

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్