🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు – మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 షాద్‌నగర్ | 🗓 21 Oct 2026 | ⏰ 03:25 PM

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆగీరు లక్ష్మీప్రసాద్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ నివాసానికి చేరుకున్న వారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. అలాగే లక్ష్మీప్రసాద్ తల్లిదండ్రులు ఆగీరు వెంకటేష్, చంద్రకళ దంపతులను సైతం శాలువాలతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చే గొప్ప సాధనమని, విద్యను సద్వినియోగం చేసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని తమ ప్రాంతానికి, తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి పిల్లలను చదివిస్తారని, వారి కష్టానికి తగిన ఫలితాన్ని అందిస్తూ పిల్లలు జీవితంలో ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రుల ఆశలు నెరవేరుతాయని అన్నారు.

ఆగీరు లక్ష్మీప్రసాద్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం షాద్‌నగర్ ప్రాంతానికి గర్వకారణమని, ఆయన విజయం ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పట్టుదల, కృషి, విద్య పట్ల అంకితభావం ఉంటే లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో న్యాయమూర్తిగా ప్రజలకు న్యాయం అందిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆగీరు రవికుమార్ గుప్తా, సామాజికవేత్త కేకే కృష్ణ, గుట్ట రాజు, కౌన్సిలర్ రాజు నాయక్, మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్