సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : సంగారెడ్డి అంబేద్కర్ భవన్లో నిర్వహించిన స్వేరోస్ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా బీబీపేట్ కె. రాజు స్వేరో అడ్వకేట్ రెండోసారి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కమ్మరి కత్తి అనిత, ఎర్రోళ్ల అరుణ్, జనార్ధన్, జనరల్ సెక్రటరీగా పల్లవి, కోశాధికారిగా గాయని తుకారాం తదితరులను నియమించారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, మైపాల్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు జరిగింది. “అక్షరం.. ఆరోగ్యం.. ఆర్థికం” ప్రధాన లక్ష్యాలతో సంస్థ ముందుకు సాగుతోందని వారు తెలిపారు. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించినందుకు బీబీపేట్ రాజు కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.






