కొమురవెల్లి, అక్టోబర్, 21 : కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ రైతులకు నాణ్యమైన విద్యుత్తును ఆటంకం లేకుండా సరఫరా చేయాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రోజున ఐనాపూర్ గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తేలు ఇస్తారి అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటును ఇస్తామని చెప్పిందన్నారు. కానీ ఈరోజు రోజుకు 6 నుంచి 7 గంటల కరెంటును మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. దీంతో రైతులు వరి నాటు పెట్టి గింజ గట్టిపడే దశలో ఉందన్నారు. ఈ దశలో వరికి అత్యధికంగా నీళ్లు అవసరం ఉంటుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సరిగా కరెంటు ఇవ్వకపోవడంతో ఎండలు విపరీతంగా కొట్టడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు.
రైతులు అనేక పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే దశలో ఎండిపోతుండడంతో దిగాలుగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన నిరాటంకమైన విద్యుత్ ను సరఫరా చేయాలని రేపు చేర్యాల ఏడి ఈ ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో పార్టీ శ్రేణులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఐనాపూర్ గ్రామంలో సిపిఎం గ్రామ కార్యాలయం ప్రారంభం కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, మండల కార్యదర్శి తాడూరి రవీందర్, మండల నాయకులు వుల్లంపల్లి సాయిలు, గ్రామ కార్యదర్శి లు కానుగుల రాజు, సున్నం యాదగిరి, కర్రోళ్ల ఎల్లయ్య, కాగిత ఆగం రెడ్డి, మల్లం అంజయ్య, ఏనుగుల శీను, కిషన్, దెయ్యాల కనకయ్య, పాశం చంద్రయ్య, దెయ్యాల పోశయ్య, తేలు కనకయ్య, ఎలా ఆంజనేయులు, రోడ్డ నరసింహులు, అబ్బోజు నవీన్, ఉల్లంపల్లి నరసవ్వ, మల్లం పోచవ్వ, తదితరులు పాల్గొన్నారు.







