🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ప్రజావీరుడు పండుగ సాయన్న పోరాటం ఆదర్శనీయం: బీజేపీ నేత నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 షాద్‌నగర్‌ | 🗓 21 Oct 2026 | ⏰ 03:20 PM

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో అక్టోబర్ 22న నిర్వహించనున్న తెలంగాణ ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలకు హాజరు కావాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డిని ముదిరాజ్ సంఘం పెద్దలు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాంతంలో జన్మించిన పండుగ సాయన్న నిజాం పాలనలో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజావీరుడిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

పేదలు, అణగారిన వర్గాల ప్రజల పక్షాన నిలిచి, వారి హక్కుల కోసం పోరాడిన ఆయనను ప్రజలు ప్రేమతో ‘తెలంగాణ రాబిన్‌హుడ్‌’గా స్మరించుకుంటారని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి, పేదల పక్షాన నిలిచిన పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి నేటి తరానికి కూడా ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన చరిత్రను భావితరాలకు తెలియజేయడంతో పాటు, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పండుగ సాయన్న జయంతి వేడుకలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు అందె బాబన్న, తాలూకా అధ్యక్షులు మంగా వెంకటేశ్వర్, తాలూకా యువజన అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్, గౌరవ అధ్యక్షులు చెట్ల జంగయ్య, నలమోని భిక్షపతి, కోశాధికారి కొండ యాదయ్య, బైరమోని సంతోష్, ఉద్యమకారుడు మేకల వెంకటేశ్ ముదిరాజ్, చల్లా భరత్, కుడుముల బాలరాజు, కార్తిక్, ప్రశాంత్, పిట్టల అంజనేయులు, భవానీ ఆలయ మాజీ చైర్మన్ కృష్ణయ్య, ఎలికటా సర్పంచ్ బుడ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్