మెదక్, అక్టోబర్0 2 : దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్లు పరిష్కరించాలని ఐజేయూ పిలుపుమేరకు టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రం మెదక్ రాందాస్ చౌరస్తాలో డిమాండ్స్ డే నిరసన చేపట్టి, కలెక్టర్ ఎఓ యూనుస్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు ఎ. శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ… జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ‘పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం’గా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ రంగాన్ని సమగ్రంగా సమీక్షించి, ఆధునిక యుగానికి అనువైన విధాన సిఫార్సులను రూపొందించడానికి ఒక కొత్త మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయడం అత్యవసరమన్నారు. పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రత కోసం ఒక ప్రత్యేక కేంద్ర చట్టాన్ని రూపొందించాలన్నారు. పత్రికా రంగం భారత ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా పనిచేస్తుంది. స్వతంత్ర, సురక్షితమైన మీడియా వాతావరణం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి పునాది.
శారీరక దాడులు, ఏకపక్ష నిర్బంధాలు, ఆన్‌లైన్ వేధింపులు, సంస్థాగత బెదిరింపులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మీడియా సిబ్బంది తమ విధులను నిర్భయంగా నిర్వర్తించేలా చూడటానికి, కేంద్ర ప్రభుత్వం పాత్రికేయులను, మీడియా సిబ్బందిని, వార్తా సంస్థలను హింస, అనుచిత అణచివేత నుండి కాపాడే ఒక పటిష్టమైన, స్వతంత్ర జాతీయ చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 1955, 1958 చట్టాల కింద మొదటగా హామీ ఇవ్వబడిన ప్రత్యేక రక్షణలను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు.
మీడియా ఉద్యోగుల కోసం రెండు దశాబ్దాల క్రితం, 2007లో ఏర్పాటు చేయబడింది. జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినప్పటికీ, ప్రభుత్వ, కార్పొరేట్ రంగాలలో జీతాలు ఎప్పటికప్పుడు సవరించబడుతున్నప్పటికీ, మీడియా కార్మికులకు చట్టబద్ధమైన వేతన నవీకరణలు అందలేదు. ముద్రణ, ప్రసార మరియు డిజిటల్ మీడియా సిబ్బందిని కలుపుకొని, న్యాయమైన, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయబడిన పరిహార నిర్మాణాలను సిఫార్సు చేయడానికి ఒక కొత్త వేతన మండలిని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
రాష్ట్రంలో జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ళు, ఇళ్లస్థలాల సమస్య పరిష్కరించడంతోపాటు ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని, జర్నలిస్టులపై నిత్యం జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తగిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. సంతోష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీ.జి. శ్రీనివాస్ శర్మ, ఐజేయూ సభ్యులు శ్రీనివాస్ మిన్పూర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బొందుగుల నాగరాజు, ప్రెస్ క్లబ్ కోశాధికారి అశోక్, గౌరవ సలహాదారులు ఫారూక్ హుస్సేన్, శ్రీధర్, హరినాథ్, గౌరవ అధ్యక్షులు కామాటి కృష్ణ, సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ బాధ్యులు రమేష్ గౌడ్, నగేష్, శివ చరణ్, రాము పటేరి, ప్రకాష్, రామ కృష్ణ గౌడ్, కృష్ణ గౌడ్, రాజశేఖర్, బోనగిరి చంద్రశేఖర్, గోవర్ధన్ రెడ్డి, చింతల రమేష్, ఖయ్యుం, యూసుఫ్ అలీ, సఫ్దర్, హమీద్, రాము పటేరి, నరేందర్, నర్సింహులు, సత్యనారాయణ, బైరవరెడ్డి, రాంచందర్ రెడ్డి, గిరి, శ్రీహరి గౌడ్, కార్తీక్, సాయి, ఆంజనేయులు గౌడ్, సుభాష్, రాఘవులు, జనార్దన్, రఘు, స్వాగత్ రాజు, శ్రీను, రాజ శేఖర్, అల్లాడి శేఖర్, లక్ష్మి నారాయణ, మురళీధర్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.








