🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

గణేష్ మండపంలో పూజారి గుండెపోటుతో మృతి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 14 Sep 2026 | ⏰ 04:34 PM

నల్గొండ జిల్లాలో వినాయక చవితి వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరుమలగిరి సాగర్ మండలం చింతపాలెం గ్రామంలో గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తున్న సమయంలో పూజారి దత్తు (65) గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ.. మార్గమధ్యంలోనే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా, గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉద్రిక్తతకు దారితీసినట్లు సమాచారం. తమ మండపంలోనే తొలిపూజ నిర్వహించాలని ఇరు వర్గాలు పట్టుబట్టడంతో పూజారి దత్తుతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.

అనంతరం పరిస్థితి సద్దుమణగడంతో దత్తు ఓ గణేష్ మండపం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

దత్తు మృతితో చింతపాలెం గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్