🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మేడ్చల్‌లో దారుణం: పూజల పేరుతో నమ్మించి బంగారం వ్యాపారిని హత్య చేసిన స్నేహితుడు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 గుండ్లపోచంపల్లి | 🗓 16 Oct 2026 | ⏰ 12:12 PM

మేడ్చల్ : డబ్బు కోసం స్నేహాన్ని సైతం మరిచి స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసింది. వ్యాపారంలో నష్టాలు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వ్యాపారి బలహీనతను ఆసరాగా చేసుకుని, పూజల పేరుతో నమ్మించి రూ.25 లక్షలు కాజేసేందుకు పన్నిన కుట్ర చివరకు ప్రాణం తీసే స్థాయికి చేరింది.

పోలీసులు మరియు స్థానికుల వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన నేమారాం చౌదరి బంగారం, వెండి వ్యాపారం చేసేవాడు. ఇతనికి సయ్యద్ ఉజ్జమాన్ ఖాస్మీతో గత కొన్నేళ్లుగా సన్నిహిత పరిచయం ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ క్రమంలో వ్యాపార పెట్టుబడిగా పెట్టిన రూ.30 లక్షలను తిరిగి ఇవ్వాలని తన కుమార్తె పెళ్లి ఉందంటూ ఖాస్మీ నేమారాంపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడం, కుటుంబంలో సమస్యలు ఎదురవుతున్నాయని నేమారాం ఖాస్మీతో చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని అనుకూలంగా మార్చుకోవాలనుకున్న ఖాస్మీ, తనకు తెలిసిన మంత్రగాడితో ప్రత్యేక పూజలు చేయిస్తే వ్యాపార నష్టాలు, గృహ సమస్యలు తొలగిపోతాయని నమ్మబలికాడు. పూజల కోసం రూ.25 లక్షలు తీసుకురావాలని చెప్పడంతో నేమారాం ఆ మొత్తాన్ని సమకూర్చుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

అనంతరం ఖాస్మీ తన స్నేహితుడు హమీద్‌తో కలిసి నేమారాంను హతమార్చేందుకు ముందస్తు ప్రణాళిక రచించాడు. పూజల పేరుతో నేమారాంను యాడారం గ్రామ సమీపంలోని నిర్మానుష్య చెరువు వద్దకు తీసుకెళ్లిన నిందితులు, అతడిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ.25 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు.

డబ్బులతో బయటకు వెళ్లిన నేమారాం ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టగా ఈ ఘోర హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్