నారాయణఖేడ్: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి జయంతి సందర్భంగా నారాయణఖేడ్‌లోని బాలాజీ అనురాధ హాస్పిటల్‌లో ఉచిత మెగా వైద్య, మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, వైద్య సలహాలు అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్యులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రక్తదాతలు, ప్రజలు పాల్గొన్నారు
నారాయణఖేడ్‌లో ఉచిత వైద్య, మహా రక్తదాన శిబిరం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:




