నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన మల్లెల శంకర్ నాగల్‌గిద్ద పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి హాజరై శంకర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన శంకర్ సేవలను అభినందిస్తూ, పదవీ విరమణ అనంతరం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పరమేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు రమేష్, అశోక్, ఉప సర్పంచ్ ధనరాజ్, దిగంబర్, విజయేందర్, లింగమేష్, సంగమేష్, కొఠారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:




