రంగారెడ్డి : ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ నందు రైతులకు ” ఫార్మర్ రిజిస్ట్రీ” గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఏఈవో రాజేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు రైతులకు వర్తించాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని ఉండాలని సూచించారు.రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవడం ద్వారా రైతులకు ఫార్మర్ ఐడి కేటాయించబడుతుందన్నారు.ఆ ఐడి ద్వారా పంటలకు కావలసిన ఎరువులు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేయడం,పంట ఉత్పత్తులని కనిస మద్దతు ధరకి ప్రభుత్వానికి అమ్మడం,పీఎం కిసాన్ పథకం కింద నిధులు పొందడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు.ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవడానికి రైతులు వారి పట్టధర్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుకి లింక్ ఉన్న ఫోన్ తీసుకొని స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లి చేయించుకోగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, శ్రీరాములు, శ్రీనివాస్, మధు తదితర రైతులు పాల్గొన్నారు.
రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి… ఏఈవో రాజేశ్వరి పిలుపు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





