🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సర్వర్ మొరాయింపు.. జోగిపేట సర్కారు దవాఖానలో ఓపీ కోసం రోగుల పడిగాపులు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 22 Sep 2026 | ⏰ 07:32 PM

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి సెప్టెంబర్ 22( ప్రజా నేస్తం ) : జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన రోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం/మంగళవారం ఉదయం ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో వచ్చిన రోగులు ఓపీ కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఓపీ స్లిప్ కోసం ఇంత సమయం ఎందుకు పడుతోందని రోగులు సిబ్బందిని ప్రశ్నించగా సర్వర్ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోందని సిబ్బంది సమాధానం ఇచ్చినట్లు రోగులు తెలిపారు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చిన వారు చాలాసేపు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వర్ సమస్యలు తరచూ తలెత్తకుండా సాంకేతిక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, రోగులకు ప్రత్యామ్నాయంగా మాన్యువల్ రిజిస్ట్రేషన్ లేదా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. రోగుల సమయం వృథా కాకుండా ఆసుపత్రి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్