🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఆందోల్‌కు మరో భారీ అభివృద్ధి కానుక: ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు!

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 22 Sep 2026 | ⏰ 04:03 PM

ఆందోల్ ప్రతినిధి, సెప్టెంబర్ 22 (ప్రజానేస్తం): ఆందోల్ నియోజకవర్గ సమగ్ర ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సి. దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవతో ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్’ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ.10 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది.

ఈ మేరకు యువజన సర్వీసులు, క్రీడా శాఖ ద్వారా జి.ఓ. ఆర్టీ నం. 282 (తేదీ: 21-09-2026) ఉత్తర్వులతో పరిపాలనా అనుమతులు (Administrative Sanction) అధికారికంగా జారీ అయ్యాయి. మంజూరైన రూ.10 కోట్ల నిధులతో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అధునాతన క్రీడా మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా వివిధ క్రీడలకు అవసరమైన ఆధునిక కోర్టులు, ట్రాక్‌ల నిర్మాణం, క్రీడాకారుల శిక్షణకు అవసరమైన అత్యాధునిక జిమ్ ఏర్పాటు చేయనున్నారు. తాగునీరు, విద్యుద్దీపాలు, డ్రెస్సింగ్ రూమ్‌లు, గ్యాలరీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

🌟 యువతలో హర్షాతిరేకాలు

గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆందోల్ యువత క్రీడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్