🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

అంగన్ మిలాన్ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బందికి సన్మానం

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 28 Sep 2026 | ⏰ 07:22 PM

మెదక్, సెప్టెంబర్ 28: . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా మెదక్ పట్టణంలో సోమవారం అంగన్ మిలాన్ కార్యక్రమం నిర్వహించారు. పట్లోళ్ల మల్లిక అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఆయమ్మ, ఆశా కార్యకర్త, ఆర్‌పీలను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విద్య, ఆటపాటలతో పాటు పాలు, గుడ్లు, పౌష్టికాహారం అందిస్తూ వారి ఎదుగుదలను పర్యవేక్షిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అలాగే గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను అంగన్వాడీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలు చిన్నారుల ఆరోగ్యం, గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ బీజేపీ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, 21వ వార్డు కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్, బాలానగర్ సర్పంచ్, మెదక్ మండల అధ్యక్షుడు బెండ వీణ, ఎన్‌ఆర్‌ఐ సెల్ జిల్లా కన్వీనర్ సౌజన్య, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సన్నీ, చైతన్య, కిషాన్ మోర్చా నాయకుడు శేఖర్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్