🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

అల్మాయిపేట్‌లో ఆదర్శం: పెద్దమనుషులకు దసరా చీరల కానుక అందజేసిన మాజీ సర్పంచ్ కుమార్తె దీవెన

Buchaiah
Buchaiah 📍 అల్మాయిపేట | 🗓 18 Oct 2026 | ⏰ 02:11 PM

దసరా పండుగ వేళ ఆందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో ఒక చక్కటి సేవా కార్యక్రమం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రవిశంకర్ కుమార్తె దీవెన తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవలో ముందుకొచ్చారు. పండుగ సందర్భంగా గ్రామంలోని పెద్దమనుషులకు ఆమె స్వయంగా చీరలను పంపిణీ చేశారు.

గ్రామ మాజీ సర్పంచ్‌గా రవిశంకర్ ప్రజలకు అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకున్న దీవెన, పండుగ సంతోషాన్ని పెద్దలతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కానుకలను అందించారు. గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరై, ఆమె అందజేసిన చిరు కానుకను ఎంతో ఆనందంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే తండ్రి సేవా గుణాన్ని అందిపుచ్చుకుని గ్రామంలోని వారిని గౌరవిస్తూ పండుగ కానుకలు అందించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. దీవెన భవిష్యత్తులో మరింత మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఆమె జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు పెద్దమనుషులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
Buchaiah
రచయిత గురించి (Author Bio)

Buchaiah

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్