🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

టేక్మాల్ అంగన్‌వాడీ కేంద్రంలో ‘ప్రోటీన్ డే’ నిర్వహణ

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 25 Sep 2026 | ⏰ 07:05 PM

టేక్మాల్: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారమే ప్రాతిపదిక అనే సందేశంతో మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ‘ప్రోటీన్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అబిస్ ఫుడ్స్ & ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, సంస్థ ప్రతినిధి బహదూర్ అలీ ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా చిన్నారుల శారీరక ఎదుగుదలతో పాటు గర్భిణులు, బాలింతలు, మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం ఎంత ఆవశ్యకమో వివరించారు. నిత్య జీవితంలో సరైన పోషకాహారాన్ని భాగం చేసుకోవడం ద్వారా పోషకాహార లోపాన్ని సమర్థవంతంగా అధిగమించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ‘ఆరోగ్యకరమైన భారత్ – బలమైన సమాజం’ నిర్మాణమే లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానిక రైతు నాయికోటి రాజు ప్రత్యేక సహకారం అందించారు. ఈ సదస్సులో డివిజన్ స్టాఫ్ పద్మలత, బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ ఫరూక్, సంస్థ ప్రతినిధి రమేష్, స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్