🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి… ఏఈవో రాజేశ్వరి పిలుపు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 25 Sep 2026 | ⏰ 05:53 PM

రంగారెడ్డి : ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ నందు రైతులకు ” ఫార్మర్ రిజిస్ట్రీ” గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఏఈవో రాజేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు రైతులకు వర్తించాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని ఉండాలని సూచించారు.రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవడం ద్వారా రైతులకు ఫార్మర్ ఐడి కేటాయించబడుతుందన్నారు.ఆ ఐడి ద్వారా పంటలకు కావలసిన ఎరువులు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేయడం,పంట ఉత్పత్తులని కనిస మద్దతు ధరకి ప్రభుత్వానికి అమ్మడం,పీఎం కిసాన్ పథకం కింద నిధులు పొందడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు.ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవడానికి రైతులు వారి పట్టధర్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరియు ఆధార్ కార్డుకి లింక్ ఉన్న ఫోన్ తీసుకొని స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లి చేయించుకోగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, శ్రీరాములు, శ్రీనివాస్, మధు తదితర రైతులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్