🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

జోగిపేటలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 24 Sep 2026 | ⏰ 08:31 PM

ఆందోల్ ప్రతినిధి, సెప్టెంబర్ 24 : గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పഴുష్ట బందోబస్తు నడుమ విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులను ఆదేశించారు. ఆందోల్–జోగిపేట పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ప్రాంతాలను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భక్తులు నీటి లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విగ్రహాల నిమజ్జనం క్యూ పద్ధతిలో సాఫీగా సాగేలా చూడాలని, ఎలాంటి విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జోగిపేటలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్యం, నిరంతర తాగునీరు మరియు లైటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అందుబాటులో ఉండాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించి నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా ముగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, తహసీల్దార్ మధుకర్ రెడ్డి, స్థానిక సీఐ అనిల్ కుమార్, ఎస్సైలు గిరి, శ్రీకాంత్, విద్యుత్ శాఖ ఏఈ, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్