కన్నెపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం ముత్తాపూర్ గ్రామానికి చెందిన సుమారు 30 మంది గ్రామస్తులు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రేణికుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముత్తాపూర్ మాజీ సర్పంచులు చంద్రయ్య, తిరుపతి, కన్నెపల్లి మాజీ ఎంపీటీసీ మంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేణికుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసే వరకు తన పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమానికి ఎండీ నాజర్ అధ్యక్షత వహించారు. పార్టీలో చేరిన గ్రామస్తులు బీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని, రేణికుంట్ల ప్రవీణ్‌కు అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.








