బెల్లంపల్లి: కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలకు తావులేదని, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో నాయకులమంతా ఐక్యంగా పనిచేస్తామని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్పష్టం చేశారు.
పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సూరిబాబు ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారంతో పాటు పట్టణ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

సీనియర్లకు ప్రాధాన్యత కల్పించాలి
దసరా పండుగ అనంతరం కాంగ్రెస్ పార్టీ వివిధ కమిటీల ఏర్పాటు సందర్భంగా సూరిబాబు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులతో చర్చించి, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్యేను కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సీనియర్ నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులంతా ఒకే కుటుంబంలా కలిసి పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో ముందుకు సాగుతూ బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములవుతామని స్పష్టం చేశారు







