🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కామ్రేడ్ గుండా మల్లేష్ 6వ వర్ధంతి సభను జయప్రదం చేయాలి

NARESH SAMARLA
NARESH SAMARLA 📍 బెల్లంపల్లి (మంచిర్యాల | 🗓 12 Oct 2026 | ⏰ 11:06 AM

బెల్లంపల్లి /తాండూర్: తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ గుండా మల్లేష్ 6వ వర్ధంతి సభను ఈ నెల 13న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ తెలిపారు.

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) గ్రామ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండా మల్లేష్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్ ఎదుట ఉన్న స్థూపం వద్ద, గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులతో కలిసి ఐబీ చౌరస్తా ఫ్లైఓవర్ కింద ఉన్న ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కొండు బానేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గుండా మల్లేష్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. శాసనసభ పక్ష నేతగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఢిల్లీలో బలంగా వినిపించారని, కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ ముందు కూడా తెలంగాణ వాదనను బలంగా వినిపించి రాష్ట్ర సాధన కోసం విశేష కృషి చేశారని తెలిపారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
NARESH SAMARLA
రచయిత గురించి (Author Bio)

NARESH SAMARLA

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్