🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

అంబా భవానీ మాత ఆలయంలో మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి ప్రత్యేక పూజలు

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 ఎలికట్ట | 🗓 15 Oct 2026 | ⏰ 07:11 PM

అంబా భవానీ మాత ఆలయంలో మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి ప్రత్యేక పూజలు.

రంగారెడ్డి జిల్లా (ప్రజా నేస్తం డిజిటల్ న్యూస్)అక్టోబర్ 15: పవిత్రమైన శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలికట్ట అంబా భవానీ మాత ఆలయాన్ని మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి సందర్శించారు. శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అంబా భవానీ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ప్రార్థించారు.

నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పవిత్రమైన విషయమని, భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత, మనోధైర్యం లభిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చంద్రయ్య, సర్పంచ్ నవ కిరణి నరసింహ ముదిరాజ్, శ్రీశైలం, శ్రీకాంత్, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్