🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మల్లన్న పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అరికట్టాలి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 కొమురవెల్లి | 🗓 14 Oct 2026 | ⏰ 08:11 PM

కొమురవెల్లి ప్రతినిధి : కొమురవెల్లి దేవస్థానం పరిసర ప్రాంతమైన ఎల్లమ్మ గుడికి పోయే దారిలో రోడ్డుపైన అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్ పర్మిషన్ను రద్దుచేసి బిల్డింగ్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తాడూరు రవీందర్ డిమాండ్ చేశారు. ఈరోజు రోడ్డుపై అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లమ్మ గుడికి పోయే దారిలో రోడ్డుపైన నిర్మాణాలు చేపడుతున్న దేవాలయ అధికారులు కానీ గ్రామపంచాయతీ అధికారులు కానీ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

దేవస్థానం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ వేలాదిమంది వస్తుపోతుంటారు, ఎల్లమ్మ గుడికి వాహనాల్లో పోయే సందర్భంలో రోడ్డుపైన ఇల్లు నిర్మించడం వలన రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలకు నిలయంగా మారుతుందని ఇప్పటికే ఇరుకైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు పర్మిషన్ ఇవ్వడంలో ఎవరైనా చేతివాటం ప్రదర్శించారా అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా దేవాలయ అధికారులు మరియు గ్రామపంచాయతీ అధికారులు స్పందించి రోడ్డుకు దగ్గరగా నిర్మిస్తున్న నిర్మాణాలను ఆపివేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల కమిటి సభ్యులు నాయకులు బద్దిపడగ కృష్ణారెడ్డి, తేలు ఇస్తారి, ఉల్లంపల్లి సాయిలు, సార్ల యాదయ్య, మ్యకల కృపాక,ర్ గాంధారి శ్రావణ చారి, ఆరుట్ల దయనదు, మల్లం అంజయ్య, తేలు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్