🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

‘జైలర్ 2’ నుంచి క్రేజీ అప్‌డేట్.. పవర్‌ఫుల్ పాత్రలో మలయాళ స్టార్ నటుడు!

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 19 Sep 2026 | ⏰ 11:23 AM

Jailer 2 : సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. చిత్ర బృందం అధికారికంగా ప్రమోషన్లను ప్రారంభిస్తూ, సినిమాలో కీలక నటీనటుల పాత్రలను పరిచయం చేసే క్రమంలో మొదటి క్యారెక్టర్ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో భాగంగా మలయాళ విలక్షణ నటుడు సూరజ్ వెంజరమూడు లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

‘దిలీప్’గా సూరజ్ వెంజరమూడు ఇంటెన్స్ ఎంట్రీ:

ఈ చిత్రంలో సూరజ్ ‘దిలీప్’ అనే అత్యంత పవర్‌ఫుల్ మరియు ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన 35 సెకన్ల క్యారెక్టర్ ప్రోమోలో ఆయన కారు దిగి సిగార్ కాలుస్తూ స్టైలిష్‌గా, గంభీరమైన లుక్‌లో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన కేరళ డ్రమ్స్ మిక్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఎంట్రీకి అదిరిపోయే హైప్‌ను తీసుకొచ్చింది.

ఈ ప్రోమోలో ఆయన రోల్ గురించిన వివరాలు సస్పెన్స్‌గా ఉంచినప్పటికీ, ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ముత్తువేల్ పాండియన్‌ను ఢీకొట్టే ప్రధాన విలన్‌గా లేదా బలమైన యాంటీ హీరోగా కనిపించనున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మొదటి భాగంలో వినాయకన్ పోషించిన వర్మన్ పాత్ర ఎంతలా ఆకట్టుకుందో, ఈ సీక్వెల్‌లో సూరజ్ పాత్ర అంతకుమించి ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

భారీ తారాగణం – విడుదల ఎప్పుడంటే?

ఈ సీక్వెల్‌లో రమ్యకృష్ణన్, యోగిబాబు, మీర్నా తమ పాత్రలను కొనసాగిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, ఎస్‌.జె. సూర్య, విద్యాబాలన్ వంటి భారీ తారాగణం కూడా భాగం కానున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ‘జైలర్ 2’ చిత్రం 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్