కొమురవెల్లి, ప్రతినిధి : కాంగ్రెస్ నాయకులు, చేర్యాల వాసి కాటం సంజీవయ్య తేజ పెద్ద కుమారుడు సాత్విక్, సమీనల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చేర్యాల–సిద్దిపేట ప్రధాన రహదారిపై వెలికట్ట గ్రామంలో ఉన్న పవార్ కన్వెన్షన్ హాల్లో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వివిధ ప్రాంతాల నాయకులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్. చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంజ మల్లేశం, మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు, జనగాం శ్రీకాంత్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.







