మెదక్ అక్టోబర్ 11 : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెదక్ మండలములోని ర్యాలమడుగు గ్రామంలో సర్పంచ్ రవి ప్రత్యేక ప్రత్యేక చొరవ తీసుకుని పారిశుధ్య పనులను నేడు ముమ్మరం చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గ్రామం లోని రహదారులను శుభ్రపరిచారు. గ్రామంలో బతుకమ్మ దసరా పండుగకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
సర్పంచ్ ఈగ రవి ఉదయం నుండి అన్ని వార్డులలో స్వయంగా పారిశుధ్య ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ బతుకమ్మలు నిర్వహించే ప్రదేశాలు, చెరువు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించారు. పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, పారిశుధ్య సిబ్బందితో పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. పండుగ సందర్భంగా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.

అలాగే తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి, పండుగ వేడుకలు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు. సర్పంచ్ ఈగ రవి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిరీష కొండల్‌రెడ్డి, బీరయ్య, భాగ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.







