సంగారెడ్డి ప్రతినిధి : గత మూడు దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సాగుతున్న సామాజిక ఉద్యమాల్లో కీలక భూమిక పోషిస్తూ, ఉపాధ్యాయులు, మేధావులను చైతన్యపరుస్తున్న యాదగిరి సార్ ఎంఈఎఫ్ (MEF) రాష్ట్ర అధ్యక్షుడిగా గురువారం బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు, ఉద్యమకారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం “గుగ్గిలం” కవితా సంకలనాన్ని ఆయనకు బహూకరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉద్యమానికి ఆయన అందించిన సేవలను నాయకులు కొనియాడారు. యాదగిరి సార్ నాయకత్వంలో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల హక్కుల సాధనకు మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంఎస్ఎఫ్ (MSF) మాజీ అధ్యక్షుడు ఈసన్నగారి సింహాచలం, నాయకులు అంజయ్య, శ్రీధర్, వి. కనకరాజు, అమృత్ బండారి తదితరులు పాల్గొన్నారు.





