🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

వెల్జాల్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేత

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తలకొండపల్లి | 🗓 07 Oct 2026 | ⏰ 05:43 PM

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 07: గ్రామ అభివృద్ధికి నిధులు మంజురు చేయాలని కోరుతూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు జి శ్రీనివాసమూర్తి, ఎం అంబాజీ, మాజీ సింగల్ విండో చైర్మన్ ఏ.అంజయ్య గౌడ్ లు బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ని ఆయన నివాసంలో కలిశారు .

ఈ సందర్బంగా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి నివాసంలో కలిసి గ్రామంలో సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్, ఐమాక్స్ లైట్ల కొరకు నిధులు మంజూరు చేయలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు జి శ్రీనివాసమూర్తి, ఎం అంబాజీ, మాజీ సింగల్ విండో చైర్మన్ ఏ.అంజయ్య గౌడ్, మాజీ ఉప సర్పంచ్లు బి నరసింహులు, అజిజ్, నాయకులు పి అశోక్ బాబు, ఏ.వెంకట్ రెడ్డి మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మాజీ సింగల్ విండో డైరెక్టర్ టి కృష్ణయ్య గౌడ్, వద్దే రాజు, పులిజాల విష్ణు, ఈ రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్