రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 15: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నందిగామ మండల కేంద్రంలో రేగొండ రవీందర్ రెడ్డి తనయుడు రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యుల సమేతంగా అమ్మవారికి పూజలు అన్నవితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగత్ జనని లోకమాత దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని,ఎలినినో ప్రభావం నుండి ప్రజలను, ప్రకృతిని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు.
అమ్మవారి, కరుణా,కృప,కటాక్షం తో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము కృష్ణ నాయకులు రేగొండ రఘునందన్ రెడ్డి,రవీందర్ రెడ్డి,రంజిత్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,శ్రీరామ్ రెడ్డి,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు





