🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

నాణ్యమైన విద్యుత్ అందించాలని కల్హేర్‌ విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 కల్హేర్ | 🗓 04 Oct 2026 | ⏰ 03:14 PM

నారాయణఖేడ్ (ప్రజా నేస్తం డిజిటల్ న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం ముట్టడించారు. సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు లో-వోల్టేజీ, హెచ్చుతగ్గుల కారణంగా గ్రామాల్లో తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు, వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని, పంటలకు సమయానికి నీరందక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి అప్పుల పాలవుతున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి, కరెంట్ కోతలతో మరింత ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

ప్రభుత్వం తక్షణమే మేల్కొని రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో కల్హేర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్