నారాయణఖేడ్, అక్టోబర్ 02 :కల్హేర్ మండలం మాసాన్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సంగారెడ్డిలో SGF ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి కుస్తీ పోటీల్లో ప్రతిభ చాటారు. నలుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎంఈవో బి.సురేశ్, ఇన్ఛార్జ్ హెచ్ఎం రాంమోహన్‌రావు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులతో పాటు పీఈటీ సుధాకర్‌ను ఎంఈవో అభినందించారు.
గోల్డ్ మెడల్స్ సాధించిన మాసాన్ పల్లి విద్యార్థులు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:




