బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డు రవీంద్రనగర్‌లో కొలువుదీరిన దుర్గామాతకు మొక్కు చెల్లించుకున్న కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్, దుర్గామాత కమిటీ–ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్‌కు రూ.లక్ష విరాళంగా అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు, వార్డు ప్రజల ఆదరణతోనే తాను భారీ మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలిచానని ఆమె తెలిపారు. అమ్మవారి కృపతో వార్డు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రవీంద్రనగర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
మొక్కు చెల్లించుకున్న 3వ వార్డు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:






