🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ప్రజా కళా జాతరకు సన్నాహాలు…మెదక్ లో కరపత్రం విడుదల

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 21 Sep 2026 | ⏰ 10:05 PM


మెదక్ : అరుణోదయ విమలక్క 50 ఏళ్ల కళా, సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 26, 27, 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ వద్ద ప్రజా కళా జాతర పోస్టర్‌ను ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోనాల స్వామి మాట్లాడుతూ.. విమలక్క ఐదు దశాబ్దాల ప్రస్థానంలో పాడిన పాటలను ఆలపిస్తూ, ఆమెతో గొంతు కలిపి ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా మండపం, బాగ్‌లింగంపల్లిలో ఆట, పాట, మాటలతో 50 గంటల పాటు ప్రజా కళా జాతర కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు ఎల్లం, రమేష్, శ్రీనివాస్, మల్లేశం, గోపాల్, సూరంపల్లి మహేందర్, పీడీఎస్‌యూ (విజృంభణ) విద్యార్థి నాయకుడు మహేష్. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్