🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

యువత ఆలోచించాలి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి: మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 షాద్‌నగర్ | 🗓 05 Oct 2026 | ⏰ 04:08 PM

రంగారెడ్డి జిల్లా/షాద్‌నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి బీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై పార్టీ శ్రేణులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ వంటి అనేక శాఖల్లో వేలాది ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తు చేశారు. ఎన్నికల వేళ రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తామని, నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేస్తామని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక యువతను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. నేటి రేవంత్ రెడ్డి పాలనలో కొత్త ఉద్యోగాల కల్పన, ఉపాధి ఊసే లేదని ధ్వజమెత్తారు.

కేజీ టు పీజీ ఉచిత విద్యతో పాటు గురుకులాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కేసీఆర్ బలోపేతం చేస్తే.. నేటి ప్రభుత్వం విద్యా రంగాన్ని సైతం నీరుగారుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత పాలన తీరును యువత, పట్టభద్రులు నిలదీయాలని కోరారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని, గ్రామాలు, పట్టణాల్లోని అర్హులైన ప్రతి పట్టభద్రుడిని కలిసి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు.

యువత ఆలోచించాలి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలి: మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పిలుపు

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రవీందర్ యాదవ్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, మహిళా కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మిలతో పాటు మాజీ మార్కెట్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్