🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

Gold rates today : మార్కెట్లో బంగారం, వెండి ధరల జోరు: దేశవ్యాప్తంగా తాజా రేట్ల వివరాలు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 హైదరాబాద్ | 🗓 01 Oct 2026 | ⏰ 08:12 AM

Gold rates today : భారత బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ వారంలో సోమ, మంగళవారాల్లో భారీ పతనాన్ని చవిచూసిన బంగారం ధరలు, బుధవారం నాటికి మళ్లీ పుంజుకుని ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నప్పటికీ, దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు స్వల్పంగా పెరిగాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం, అక్టోబర్ 1 ఉదయం 6:30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,49,580 వద్ద ట్రేడవుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,110 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,190 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ నిలకడగా ఉండటంతో నగరంలో కిలో వెండి ధర రూ.2,45,100 వద్ద స్థిరపడింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఒకే రీతిన స్థిరంగా నమోదయ్యాయి. 10 గ్రాముల విభాగంలో నమోదైన వివరాలు:

నగరం / ప్రాంతం24 క్యారెట్లు (రూ.)22 క్యారెట్లు (రూ.)18 క్యారెట్లు (రూ.)
వరంగల్1,49,5801,37,1101,12,190
నిజామాబాద్1,49,5801,37,1101,12,190
ఖమ్మం1,49,5801,37,1101,12,190
విజయవాడ1,49,5801,37,1101,12,190
విశాఖపట్నం1,49,5801,37,1101,12,190
అమరావతి1,49,5801,37,1101,12,190
కాకినాడ1,49,5801,37,1101,12,190
తిరుపతి1,49,5801,37,1101,12,190

దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ధరలు

స్థానిక పన్నులు, వ్యాట్, రవాణా ఛార్జీల ఆధారంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బంగారం ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల పసిడి ధరల పట్టిక:

నగరం / రాష్ట్రం24 క్యారెట్లు (రూ.)22 క్యారెట్లు (రూ.)18 క్యారెట్లు (రూ.)
చెన్నై1,49,5801,37,1101,14,810
ముంబై1,49,5801,37,1101,12,190
ఢిల్లీ1,48,9301,37,2601,12,340
కోల్‌కతా1,49,5801,37,1101,12,190
బెంగళూరు1,49,5801,37,1101,12,190
కేరళ1,49,5801,37,1101,12,190
పుణె1,49,5801,37,1101,12,190
వడోదరా1,49,6301,37,1601,12,240

అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, స్టాక్ మార్కెట్ల కదలికల వల్ల బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వీటిపై జీఎస్టీ (GST), తరుగు, తయారీ కూలీ (మేకింగ్ ఛార్జీలు) అదనంగా ఉంటాయి కాబట్టి కొనుగోలుదారులు లావాదేవీలకు ముందు సమీప నగల వ్యాపారుల వద్ద తాజా ధరలను ధృవీకరించుకోవాలి.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్