సంగారెడ్డి : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ దేశానికి అందించిన సేవలను, అహింసా మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన చేసిన కృషిని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, సునీల్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, చీల మలన్న మాజీ జడ్పీటీసీ పాండు, కౌన్సిలర్ దశరథ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ నందం, మాజీ కౌన్సిలర్ విష్ణు , శ్రవణ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.





