🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

Weather Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన: 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 22 Sep 2026 | ⏰ 11:37 PM

Weather Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు.

తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Weather Alert జిల్లాల వారీగా ప్రభావం – ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం:

  • అతి భారీ వర్షాలు: రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
  • భారీ వర్షాలు: మరో 20 జిల్లాల్లో పడే సూచనలు ఉన్నాయి.
  • ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు: పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలు.

ప్రజలకు హెచ్చరికలు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, స్థానిక యంత్రాంగం ఇచ్చే భద్రతా ఆదేశాలను పాటించాలని హెచ్చరించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్